News August 27, 2025
NZB: ఈనెల 29న ఉద్యోగమేళ: DIEO

2024-25లో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులకు HCL టెక్ బీ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29 శుక్రవారం ఉద్యోగమేళ నిర్వహిస్తున్నట్లు DIEO తిరుమలపుడి రవికుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగమేళలో MPC, BiPC, MEC, CEC, వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు అర్హులన్నారు. సోమవారం ఉ.10గం.కు వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, కోటగల్లిలో ఈ డ్రైవ్ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 8074065803 నంబర్‌ను సంప్రదించొచ్చు.
Similar News
News August 27, 2025
SRSP UPDATE: 25 గేట్లు ఓపెన్.. లక్ష క్యూసెక్కులు విడుదల

SRSPకి వరద నీరు పోటెత్తడంతో మొత్తం 25 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు 8 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. 25 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లోగా 50 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా 1,30,392 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
News August 27, 2025
NZB: SRSP 17 గేట్లు ఎత్తివేత

SRSPకి వరద నీరు పోటెత్తుడడంతో మొత్తం 17 వరద గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు 8 గేట్లు ఎత్తగా ఇన్ ఫ్లో పెరగడంతో మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసి మొత్తం 17 గేట్ల ద్వారా 51,578 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లోగా 50 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా 82,105 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
News August 27, 2025
SRSP UPDATE: 1,090.90 అడుగులకు చేరిన నీటిమట్టం

శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. బుధవారం ఉదయం 11 గంటలకు 1,090.90 అడుగులకు(80.053TMC) నీటి మట్టం చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 55,527 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు వివరించారు.