News December 30, 2024
NZB: ఈ ఏడాది క్రైమ్ రేట్ వివరాలు ఇలా..
NZB జిల్లాలో ఈ ఏడాదికి సంబంధించిన కేసుల వివరాలను ఇన్ ఛార్జ్ CP సింధు శర్మ వెల్లడించారు. శారీరక నేరాలు, ఆస్తి నేరాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఎక్కువే అయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ, మృతి చెందిన కేసులు, సైబర్ నేరాలు, పోక్సో, మిస్సింగ్, గేమింగ్ ఆక్ట్ కేసులు కూడా ఎక్కువగానే నమోదయ్యాయి. గతేడాది 356 ఆత్మహత్యలు జరగగా ఈ యేడు 442 జరిగాయి. గాంజా కేసులు 22 నమోదు కాగా 58 మందిని అరెస్ట్ చేశామన్నారు.
Similar News
News January 2, 2025
NZB: బీసీ మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాదులోని ఆమె నివాసంలో బుధవారం బీసీ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. శాతవాహన యూనివర్సిటీ నాయకులు మహేశ్ మాట్లాడుతూ..ఈ నెల 3వ తేదీన సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఇంద్ర పార్క్ వద్ద బీసీ మహా సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీలోని అన్ని కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. రమేష్, అన్వేష్, శివ, పవన్, ప్రేమ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
News January 2, 2025
జైలుకు వెళ్లి వచ్చిన వారు క్రైం రేటు పెరిగిందంటున్నారు: షబ్బీర్ ఆలీ
జైలుకు వెళ్లి వచ్చిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో నేరాలు పెరిగాయని, క్రైం రేటు పెరిగిందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నేరాలు అధికంగా జరిగాయని ఆరోపించారు. ఒక మహిళ అయి ఉండి లిక్కర్ వ్యాపారం చేసి అందరిని తాగుబోతులుగా మార్చి క్రైమ్ రేట్ పెంచారని విమర్శించారు.
News January 2, 2025
NZB: నేడు జిల్లాకు ఏకసభ్య కమిషన్
ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ గురువారం ఉపవర్గీకరణ, వివరణాత్మక అధ్యయనం కోసం జిల్లాకు వస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులానికి చెందిన వారు హాజరై వినతులను అందివచ్చని సూచించారు. తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టీస్ డాక్టర్ షమీమషమీమ్ అక్తర్ తో కూడిన ఏక సభ్య కమిషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చారు.