News March 9, 2026

NZB: ఈ నెల 10న జాబ్ మేళా

image

ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 10న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీ.టెక్ పూర్తి చేసినవారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో నిజామాబాద్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. 18-35 ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News March 9, 2026

పుట్టపర్తి: హెచ్‌పీవీ టీకా పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్

image

పుట్టపర్తిలో హెచ్‌పీవీ టీకా పోస్టర్లను కలెక్టర్ శ్యాంప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు. 28 ఫిబ్రవరి 2026 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలికలకు ఈ టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాకు మొదటి విడతగా 6,390 డోసులు వచ్చాయని, వాటిని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బాలికల తల్లిదండ్రులు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేయించుకోవాలని సూచించారు.

News March 9, 2026

HYD మెట్రో ‘భారం’.. ఆర్థిక సంక్షోభం!

image

హైదరాబాద్ మెట్రో మొదటి దశను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఈ మార్చి నాటికి తుది దశకు చేరుతుంది. సుమారు ₹13,000 కోట్ల అప్పులతో పాటు L&Tకి ₹2,000 కోట్ల సెటిల్మెంట్ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. PPP మోడల్ విఫలమైందని అడ్మినిస్ట్రేషన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రభుత్వంపై పడుతున్న ఈ భారీ ఆర్థిక భారం భవిష్యత్తులో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

News March 9, 2026

HYD: పట్టాల మాటున ప్లాట్ల వ్యాపారం!

image

రైలు పట్టాల కింద ఉన్న భూములే మెట్రో ఫేట్ డిసైడ్ చేస్తున్నాయా? 2వ దశ విస్తరణలో అలైన్‌మెంట్ మార్పుల వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. JAN 2026లో ప్రభుత్వం ₹2,787 కోట్ల భూసేకరణ నిధులను కేటాయించింది. ఎయిర్‌పోర్ట్, ఫోర్త్ సిటీ మెట్రో రూట్లను పదేపదే మార్చడంతో ప్రైవేట్ వెంచర్ల విలువ ₹వేల కోట్లకు చేరింది. TOD పేరుతో జరుగుతున్న ఈ భూముల కేటాయింపులపై ఇప్పటికే హైకోర్టులో PIL దాఖలయ్యాయి.