News February 28, 2025

NZB: ఉచిత చికెన్ కోసం ఎగబడిన ప్రజలు

image

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చికెన్ అమ్మకాలు తగ్గడంతో చికెన్ అమ్మకందారులు జిల్లాలో రోజుకో చోట చికెన్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలోని బోధన్ బస్టాండ్ సమీపంలో శుక్రవారం మేళా ఏర్పాటు చేశారు. ఉచిత చికెన్ పదార్థాల కోసం భారీగా జనం తరలివచ్చారు. చికెన్ సెంటర్ యజమానులు మాట్లాడుతూ.. కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ అంటూ వచ్చిన వార్తలు వాస్తవమేనని.. కానీ మన జిల్లాలో లేదని స్పష్టం చేశారు.

Similar News

News February 28, 2025

NZB: అభివృద్ధి, సంక్షేమం, కాంగ్రెస్ సిద్ధాంతాలు: TPCC చీఫ్

image

అభివృద్ధి, సంక్షేమం, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన TPCC విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచనలు, సలహాలను పాటిస్తూ పార్టీ కోసం శ్రమిద్దామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటపై ప్రజలకు నమ్మకముందన్నారు.

News February 28, 2025

NZB: ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: డీఐఈఓ

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DIEO తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. మార్చ్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణ కోసం శుక్రవారం నగరంలోని ఖిల్లా జూనియర్ కళాశాలలో చీఫ్ సూపర్రింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశం నిర్వహించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

News February 28, 2025

NZB: DJ సౌండ్ ఎఫెక్ట్.. కుప్పకూలి వృద్ధురాలి మృతి

image

DJ సౌండ్ ఓ వృద్ధురాలి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర బైపాస్ రోడ్‌లో జరిగింది. కలెక్టరేట్ వెళ్లే రహదారిలో నివాసముండే కె.భారతమ్మ (70) గురువారం రాత్రి తన ఇంటి సమీపంలో ఓ వేడుక జరుగుతుంటే చూడడానికి వెళ్లింది. అయితే అక్కడ DJ సౌండ్‌కు ఆమె అక్కడే కుప్పకూలగా హుటాహుటినా ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

error: Content is protected !!