News August 27, 2025
NZB: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్‌పల్లి ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం వర్క్ కోర్సుల్లో ఉచిత శిక్షణకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 19-45 సంవత్సరాల వయసు మధ్య ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి డిచ్‌పల్లిలోని RESTI ఆఫీసును సంప్రదించాలన్నారు.
Similar News
News August 27, 2025
ఆ దేశాలతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు: ట్రంప్

యూకే, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్, దక్షిణ కొరియా, EU దేశాలతో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆయా దేశాలు బిలియన్ల డాలర్లు US ట్రెజరీకి చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. అటు భారత్‌పై ఇప్పటికే 25% టారిఫ్స్ ఉండగా అదనంగా విధించిన టారిఫ్స్ IST ప్రకారం ఇవాళ ఉ.9.31 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత ఎగుమతులపై టారిఫ్స్ 50శాతానికి చేరుతాయి.
News August 27, 2025
ప్రజా సమస్యలు మీడియా వెలికి తీయాలి: MP రఘునందన్

ప్రజా సమస్యలను మీడియా వెలికి తీసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మీడియా అవగాహన సదస్సులో అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలన్నారు. ఖచ్చితమైన సమాచారం సేకరించి వార్తలు రాయాలని సూచించారు.
News August 27, 2025
స్టే.ఘ: యూరియా కోసం షాప్‌ల ముందు రైతుల పడిగాపులు

మునిగినా, తేలినా భూమినే నమ్ముకునే రైతులు ఎకరం సాగు చేయాడానికి నానా అవస్థలు పడుతున్నారు. రైతులకు సాగు కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. సాగు నీటి సమస్య, కూలీల సమస్య, గిట్టుబాటు ధర సమస్యతో పాటు ప్రభుత్వం స్పందిస్తే పరిష్కారం అయ్యే యూరియా సమస్యతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. మంగళవారం స్టే.ఘ. మండల శివునిపల్లిలో ఉదయం ఫర్టిలైజర్ షాప్ తీయకముందే షాపు ముందు వర్షం పడుతున్నా రైతులు ఎరువుల కోసం పడిగాపులు కాశారు.