News January 26, 2025
NZB: ఉత్తమ ప్రిన్సిపల్‌గా డీఐఈఓ రవికుమార్
జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల ఉత్తమ ప్రిన్సిపల్‌గా తిరుమాలపూడి రవికుమార్ ఎంపికయ్యారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు చేతుల మీదుగా ఆదివారం ప్రశంసాపత్రం అందుకున్నారు. కాగా జిల్లా ఇంటర్ విద్య అధికారిగా కూడా రవికుమార్ కొనసాగుతున్నారు.
Similar News
News January 27, 2025
NZB: ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్
నిజామాబాద్ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు కలెక్టర్‌కు పుష్ప గుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
News January 27, 2025
మేడ్చల్‌లో బోధన్‌కు చెందిన మహిళ హత్య
మేడ్చల్ మండలంలో ORR బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద ఈ నెల 24న జరిగిన <<15246720>>మహిళ <<>> హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు గురైన మహిళ బోధన్‌కు చెందిన వివాహితగా గుర్తించారు. భర్తకు దూరంగా కొంపల్లిలో మరో వ్యక్తితో ఆమె ఉంటున్నట్లు సమాచారం. ఇదే నిజం అయితే ఈ కేసులో ఆ వ్యక్తి కీలకంగా మారనున్నాడు. కాగా.. వివాహిత కుటుంబంతో పాటు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలను సేకరిస్తున్నారు.
News January 27, 2025
నిజామాబాద్‌లో శునకాలకు బారసాల
నిజామాబాద్ నగర శివారులోని మాణిక్‌భండార్‌లో ఓ కుటుంబం ఆదివారం శునకాలకు బారసాల చేశారు. మాణిక్ బండారుకు చెందిన నర్సాగౌడ్, మంజుల దంపతులు ఓ శునకాన్ని తెచ్చుకుని దానికి లూసీ అని పేరు పెట్టారు. లూసీ ఇటీవల ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో వాటికి ఆ దంపతులు ఘనంగా బారసాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేశారు.