News December 4, 2025
NZB: ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ సమీక్ష

పంచాయతీ ఎన్నికల భద్రత చర్యలపై డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉమ్మడి నిజమాబాద్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై క్షుణ్ణంగా వివరించారు. డీజీపీ పలు కీలక సూచనలు చేశారు. NZB సీపీ సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 4, 2025
GNT: మారువేషంలో వచ్చి.. మార్చూరీలో తనిఖీలు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి మరోసారి మారువేషంలో ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేషన్ తీరును పరిశీలించారు. ఈసారి ఆయన టీషర్ట్, మడత వేసిన ప్యాంటు, మాస్క్, మంకీ క్యాప్ ధరించి మార్చూరీ బయట సాధారణ వ్యక్తిలా ఒక గంటపాటు కూర్చున్నారు. అక్కడే ఉండి, మృతదేహాల బంధువులతో మాట్లాడి, మార్చూరీలోని పరిస్థితులను అధ్యయనం చేశారు.
News December 4, 2025
స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 41వ బోర్డు సమావేశంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఛైర్మన్, కలెక్టర్ డా. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా పాల్గొన్న ఎండి, కమిషనర్ ఎన్. మౌర్య సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇతర పెండింగ్ పనుల పురోగతిని వివరించారు. స్మార్ట్ సిటీ నిధుల మంజూరుపై ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్ సూచించారు.
News December 4, 2025
నెల్లూరులో 5,198 మైక్రో ఎంటర్‌ప్రైజెస్ నమోదు..!

లోక్ సభలో నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి AP, నెల్లూరులో SHG కింద ఉన్న మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌పై ప్రశ్నించారు. MSME పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరండ్లాజే మాట్లాడుతూ.. MSME పరిశ్రమల రిజిస్ట్రేషన్‌కు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను 1జులై2020న ప్రారంభించామన్నారు. అప్పటి నుంచి మైక్రో ఎంటర్ ప్రైజెస్ 30 నవంబర్ 2025 నాటికి APలో SHGల తరఫున 1,30,171, నెల్లూరులో 5,198 నమోదయ్యాయన్నారు.


