News July 5, 2024

NZB: ఉరేసుకుని కండక్టర్ ఆత్మహత్య

image

అనారోగ్యం కారణంగా ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. జిల్లాలోని మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఈరవత్రి శ్రీనివాస్ (36) కండక్టర్‌గా పని చేస్తూ నిజామాబాద్ నాందేవ్ వాడాలో అద్దెకు ఉంటున్నాడు. కిడ్నీ నొప్పి భరించలేక గురువారం రాత్రి రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 6, 2026

NZB: తెలంగాణ ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారు: ఈటెల

image

తెలంగాణ ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ శివారులోని కమ్మ సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేనని అన్నారు. నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు.

News March 6, 2026

తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే: ఎంపీ అర్వింద్

image

నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ కమ్మ సంఘంలో శుక్రవారం బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమిపాలైన వారు నిరుత్సాహపడవద్దని, అది విజయానికి నాంది అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

News March 6, 2026

కమ్మర్‌పల్లి ప్రాంతంలో పులి సంచారం

image

మహారాష్ట్రలోని తాడోబా నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. బీట్ ఆఫీసర్ శ్రీదేవి ఈ పులిని ప్రత్యక్షంగా చూశారని తెలిసింది.