News April 4, 2025
NZB: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్ నగరంలోని గాయత్రీ నగర్‌లో ఎర్రమల పవన్ రాజు(25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు నగరంలోని ఒక బట్టల షాపు వేర్ హౌస్‌లో పని చేసేవాడు. అక్కడ పని చేసే అతడి స్నేహితురాలు వ్యక్తిగత కారణాలతో మృతి చెందగా నాటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News April 4, 2025
NZB: సన్న బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి: మంత్రి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం సన్న బియ్యం పంపిణీపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు.
News April 4, 2025
నిజామాబాద్‌లో ముస్లింల నిరసన

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై నిజామాబాద్ నగరంలోని నెహ్రూపార్క్ వద్ద ముస్లింలు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చి ముస్లింల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏసీపీ(ACP) రాజా వెంకట్ రెడ్డి, 1వ టౌన్ (SHO) రఘుపతి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పారు.
News April 4, 2025
NZB: అధికారులపై కలెక్టర్ అసంతృప్తి

రెంజల్ మండలం దూపల్లి, దండిగుట్ట కొనుగోలు కేంద్రాలలోని రిజిస్టర్లలో వివరాలు సరిగా నమోదు చేయకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్టర్లలో విధిగా వివరాలు నమోదు చేయాలని రైతులకు ధాన్యం రకం, ఎంత పరిమాణంలో వారి నుంచి ధాన్యం సేకరించారు. తదితర వివరాలతో కూడిన రసీదు ఇవ్వాలని ఆదేశించారు. ట్రక్ షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు.