News May 8, 2024

NZB ఎంపీ స్థానంపై CM ఫోకస్.. పక్షం రోజుల్లోనే మరో విజిట్

image

NZB లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా CM రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత నెల 22న NZBలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన బుధవారం NZB, ఆర్మూర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. కేవలం పక్షం రోజుల గ్యాప్‌లో జిల్లాకు రెండో సారి వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. మరో పక్క ఈ నెల 11న KMR జిల్లా ఎల్లారెడ్డిలో ప్రియాంక గాంధీ ప్రోగ్రాం ఫిక్స్ అయ్యింది.

Similar News

News January 18, 2025

నిజాంసాగర్: నేడు జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశ పరీక్ష

image

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో శనివారం నిర్వహించే 2025 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు శనివారం 10:30 వరకు పాఠశాలకు చేరుకోవాలని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ మనుజే యోహనన్ తెలిపారు. 11 గంటల తర్వాత లోపలికి అనుమతించమని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

News January 18, 2025

నిజామాబాద్: ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు రాక

image

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిజామాబాద్ రానున్నారు. ఉదయం 10 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు చేరుకునే ఆయన అక్కడ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కు పోలీస్ కమిషనరేట్‌లో భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. తదుపరి గోల్ హనుమాన్ వద్ద మున్సిపల్ జోన్ కార్యాలయాన్ని ప్రారంభించి రూ.380 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు.

News January 17, 2025

నిర్మలా సీతారామన్‌ను కలిసిన ఎంపీ అరవింద్

image

కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ను నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇటీవలి పరిణామాలను వివరించాను. అదేవిధంగా కొత్తగా ప్రారంభించబడిన జాతీయ పసుపు బోర్డు పట్ల రాష్ట్రంలో జరుగుతున్న ఆనందోత్సాహాలు వారికి వివరించారు.