News March 31, 2024
NZB: ఎన్నికల కోడ్.. నగదు పట్టివేత

నిజామాబాద్ నగరంలో ఒకటో టౌన్ పోలీసులు రూ.4.8 లక్షల నగదును పట్టుకున్నారు. శనివారం వీక్లీ మార్కెట్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. శివప్రసాద్ అనే ఫైనాన్స్ వ్యాపారి ఎలాంటి పత్రాలూ లేకుండా రూ.4.8 లక్షల నగదును తరలిస్తుండగా సీజ్ చేసినట్లు వన్‌టౌన్ SHO విజయబాబు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును తరలించేవారు నగదుకు సంబంధించిన పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలన్నారు.
Similar News
News April 23, 2025
NZB: వడదెబ్బ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

వాతావరణ మార్పులు-ప్రభావం వడదెబ్బపై పోస్టర్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతులమీదుగా ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు దాని ప్రభావం వడదెబ్బ నుంచి రక్షించుకుందాం అనే పోస్టర్లను అడిషనల్ కలెక్టర్ అంకిత్‌తో కలిసి ఆవిష్కరించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో తీవ్రమైన వేడితో కూడిన ఎండలు ఉన్నందున ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News April 22, 2025
ఆర్మూర్: చెరువులో మునిగి వ్యక్తి మృతి

చెరువులో పడిన గేదెను కాపాడబోయి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంకాపూర్ శివారులోని గుండ్ల చెరువు వద్ద రమేశ్ గేదెలను మేపుతుండగా అవి చెరువులోకి వెళ్లాయి. వాటిని కాపాడేందుకు అతను చెరువులో దిగాడు. చేపలవల తట్టుకొని నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడు ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 22, 2025
నిజామాబాద్: 59.25 శాతం ఉత్తీర్ణత: DIEO

ఇంటర్మీడియట్ 2024-25 విద్యా సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాలో 59.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మంగళవారం తెలిపారు. వార్షిక పరీక్షల్లో జిల్లాలో రెండో సంవత్సరం విద్యార్థులు 59.25 శాతం ఉత్తీర్ణత సాధించారని, మొదటి సంవత్సరంలో 53.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వివరించారు.