News April 25, 2024

NZB: ఎన్నికల కోడ్.. భారీగా నగదు పట్టివేత!

image

ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో అక్రమ నగదు సరఫరాను అధికారులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో అధిక మొత్తంలో తరలిస్తున్న డబ్బును, మద్యం, ఇతర విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 53,42,830 నగదును పోలీసులు పట్టుకున్నారు.

Similar News

News September 30, 2024

కామారెడ్డి జిల్లా టాపర్‌గా పిట్లం యువతి

image

సోమవారం వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మార్దండ గ్రామానికి చెందిన కోటగిరి మౌనిక జిల్లాలో మొదటి స్థానం సాధించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జిల్లా మొదటి స్థానం సంపాదించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News September 30, 2024

NZB: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య ఎలా జరుపుకోవాలని నిజామాబాద్, కామారెడ్డి జిల్లావాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News September 30, 2024

నిజామాబాద్‌లో 8,30,580 ఓటర్లు ఉన్నారు..!

image

నిజామాబాద్ జిల్లాలో 27 మండలాలు ఉండగా 545 గ్రామపంచాయతీలో 5022 వార్డులు ఉన్నాయి. జిల్లా మొత్తంలో 8,30,580 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 4,43,548 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 3,87,017 మంది పురుషులు, 15 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో పంచాయతీ ఎన్నికల్లో వారు కీలకంగా మారనున్నారు.