News August 10, 2024

NZB: ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌పై జిల్లాలో విస్తృతంగా చర్చ

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం సుప్రీం కోర్టు తలుపు తట్టడంతో ఆమెకు బెయిల్ వస్తుందా? లేదా? అనే చర్చ జిల్లాలో విస్తృతంగా జరుగుతోంది. ఇదే కేసులో 2 రోజుల క్రితం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా తీహార్ జైలులో ఉన్న కవిత కూడా శనివారం సుప్రీం కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయడం ఆసక్తికరంగా మారింది.

Similar News

News September 1, 2025

HMSతో దోస్తీ.. TBGKSతో కవిత కటీఫ్

image

BRS అనుబంధ సింగరేణి కార్మిక సంఘం TBGKSకు MLC కవిత గుడ్ బై చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల TBGKS గౌరవ అధ్యక్ష పదవి నుంచి BRS కవితను తప్పించి కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతలు కట్టబెట్టింది. HMSతో దోస్తీ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం HMS గౌరవ అధ్యక్షురాలిగా కవితను సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ప్రతిపాదించగా.. అందరూ మద్దతు పలికారు. కాగా.. కవిత వీటిలో దేనిపై స్పందించలేదు.

News August 31, 2025

SRSP UPDATE: తగ్గుముఖం పట్టిన ఇన్ ఫ్లో.. ఔట్ ఫ్లో

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో, ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో తగ్గుముఖం పట్టింది. నిన్న ఇన్ ఫ్లో 6 లక్షలు, ఔట్ ఫ్లో 5.50 లక్షల క్యూసెక్కులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇన్ ఫ్లో 3.70 లక్షలు, ఔట్ ఫ్లో 3,26,853 క్యూసెక్కులకు తగ్గింది. కాగా ప్రాజెక్టులో తాజాగా 1088 (69.85TMC) అడుగులకు నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News August 31, 2025

NZB: NDRF, SDRF సేవలు భేష్..

image

ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాలలో NDRF, SDRF బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించగలిగామన్నారు.