News March 6, 2025
NZB: ఎల్ఆర్ఎస్ ఫీజు వసూళ్లలో వేగం పెంచాలి: కలెక్టర్

ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్ధీకరణ రుసుము వసూళ్లలో వేగం పెంచాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులో పాత బకాయిలు సహా వంద శాతం పన్ను వసూలయ్యేలా చొరవ చూపాలన్నారు. పన్ను వసూళ్లలో పూర్తిగా వెనుకంజలో ఉన్న గ్రామ పంచాయతీల కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని DLPOలను ఆదేశించారు. LRS క్రమబద్ధీకరణ ఫీజును మార్చి నెలాఖరు లోపు చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందన్నారు.
Similar News
News March 6, 2025
NZB: MLC ఎన్నికలు.. ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ నుంచి పోటీ చేసిన అంజిరెడ్డి 98,637 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నరేందర్ రెడ్డికి 93,531 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు 63,972 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News March 6, 2025
నిజామాబాద్ జిల్లాలో వింత పరిస్థితి.. పగలు ఎండ.. రాత్రి చలి!

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నా.. రాత్రిళ్లు చలి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో పగటి సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కానీ రాత్రయ్యే సరికి చలి విరుచుకుపడుతోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలోని సిరికొండ మండలం తూమ్పల్లిలో 9.3℃ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వేసవిలో ఎండతో పాటు చలికి కూడా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
News March 6, 2025
NZB: ఒకే రోజు నలుగురు మృతి.. జర జాగ్రత్త..!

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం ఒక్క రోజు వివిధ గ్రామాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో అంజవ్వ, డొంకేశ్వర్ మండలం అన్నారంలో చిన్నారెడ్డి, ఎడపల్లి మండలం ఠాణాకలాన్‌లో శ్రీనివాస్, రామారెడ్డిలో మానస మరణించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.