News January 2, 2025
NZB: ఎస్సీ వర్గీకరణ వద్దని న్యాయమూర్తికి నివేదిక అందజేత
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం దళిత కళ్యాణ్ సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తూ జస్టిస్ షమీం అక్తర్ కమిటీకి నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు దౌలత్ చక్రే మాట్లాడుతూ.. అన్నదమ్ములుగా ఉన్న ఎస్సీలను ఐక్యమత్యంగా ఉండకూడదనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ కుట్ర చేసిందన్నారు. 15% ఉన్న రిజర్వేషన్లను 22 % కు పెంచాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 5, 2025
ఎడపల్లి: యువకుడి పై కత్తులతో దాడి
ఎడపల్లి గ్రామానికి చెందిన ప్రణయ్ అనే యువకుడు తన ఇంటి వద్ద శుక్రవారం రాత్రి మిత్రులతో ముచ్చటిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్, నరేష్, కల్యాణ్, చంద్రకాంత్ అతని తమ్ముడు రవికాంత్ దుర్భషలాడుతూ.. ప్రణయ్ పై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రణయ్ మిత్రులు అక్కడి నుంచి పారిపోయారు. వారు ప్రణయ్ పై కత్తులతో దాడి చేసి గాయపర్చారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నామన్నారు.
News January 5, 2025
ఆర్మూర్: కోడి పందెల స్థావరంపై పోలీసుల దాడి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శనివారం దూదేకుల కాలనీలో కోడి పందెలు నిర్వహిస్తున్న 13 మందిని పట్టుకున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. వారి నుంచి కోడి కత్తులు, రూ.7,380 నగదు, 11 సెల్ ఫోన్లు, 4 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
News January 5, 2025
బాన్స్‌వాడ: భూములు కబ్జా కాకుండా చూడాలని వినతి
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థకు సంబంధించిన భూములు కబ్జాకు గురికాకుండా చూడాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ను అదనపు కలెక్టర్‌కు వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆగ్రో ఛైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ కబ్జా చేసిన భూములను ఆగ్రోస్ సంస్థకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు కోరినట్లు పేర్కొన్నారు.