News July 20, 2024
NZB: ఏడాదిన్నరలో రోడ్డు ప్రమాదాల్లో 550 మంది మృతి

NZB జిల్లాలో గడిచిన ఏడాదిన్నరలోనే రోడ్డు ప్రమాదాలలో 550 మంది ప్రాణాలు కోల్పోయారని CP కల్మేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటుబెల్టు ధరించకపోవడం, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ టేక్, సెల్ ఫోన్ డ్రైవింగ్, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, రాంగ్ సైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
Similar News
News August 21, 2025
రూ.50.95 కోట్ల రుణాలు: NZB కలెక్టర్

జిల్లాలో ఇప్పటి వరకు 4,348 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ.50.95 కోట్ల రుణాలు మంజూరు చేశామని NZB కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 3,916 మంది లబ్ధిదారులకు రూ.46.59 కోట్లు, మెప్మా ద్వారా 432 మందికి రూ.4.36 కోట్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులను చేపట్టాలని కలెక్టర్ కోరారు.
News August 21, 2025
NZB: త్వరలో సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు: CP

జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేయడం కోసం సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో సీపీ మాట్లాడారు. ఈ కౌన్సిల్ భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలపై తక్షణ పర్యవేక్షణ చేసి వాటి నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
News August 21, 2025
జులైలో 1708 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జులై నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు దాదాపు 1708 నమోదు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. ఈ కేసుల్లో 966 మంది నిందితులపై అభియోగాలు మోపుతూ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 77 కేసుల్లో జైలు శిక్ష విధించగా మిగతా కేసులలో జరిమానాలు విధించారని వివరించారు.