News March 19, 2024
NZB: ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్పీ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30ల నుంచి 5.30ల వరకు జరగుతాయన్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News September 5, 2025
NZB: మార్కెట్ యార్డుకు నాలుగు రోజులు సెలవులు

నిజామాబాద్ మార్కెట్ యార్డ్‌కు గురువారం నుంచి సోమవారం వరకు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ సెకండ్ గ్రేడ్ కార్యదర్శి తెలిపారు. శుక్రవారం మిలాద్-ఉన్-నబి, శనివారం వినాయక నిమజ్జనం, ఆదివారం సెలవు, సోమవారం గ్రహణం కారణంగా వ్యాపార లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి మంగళవారం నుంచి మార్కెట్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News September 4, 2025
భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: NZB కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన ఆర్డీఓలు, తహశీల్దార్లతో వీసీ ద్వారా భూభారతిపై సమీక్ష జరిపి మాట్లాడారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
News September 4, 2025
NZB: 200 సీసీ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ శోభయాత్ర కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు CP సాయిచైతన్య తెలిపారు. శోభయాత్ర దారి పొడవునా గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. 200 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. 1,300 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని CP వివరించారు.