News February 14, 2025
NZB: ఒంటరి మహిళ మెడలోంచి గొలుసు అపహరణ

NZBలో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును అపహరించుకు వెళ్లాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వీక్లీ మార్కెట్‌కు చెందిన విజయ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇదే అదునుగా భావించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్ టౌన్ ఎస్ఐ మొగులయ్య తెలిపారు.
Similar News
News February 19, 2025
NZB: స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాము: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించేలా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మంగళవారం కలెక్టర్ జిల్లా ప్రత్యేక అధికారి శరత్ తో సమావేశమై మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు వారం వారం క్రమం తప్పకుండా మండలాల్లో పర్యటిస్తూ పర్యవేక్షణ జరిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
News February 18, 2025
NZB: ఆరుగురి హత్య.. కోర్టు సంచలన తీర్పు

నిజామాబాద్ జిల్లాలో 2023లో సంచలనం రేపిన ఆరుగురి హత్య కేసులో జిల్లా కోర్డు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రశాంత్, అతని తల్లి వడ్డేమ్మకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తీర్పును వెలువరించారు. 2023లో మాక్లూర్ మండల కేంద్రంలో ప్రసాద్ కుటుంబానికి చెందిన ఆస్తిని అతని స్నేహితుడు ప్రశాంత్ కాజేసేందుకు కుట్ర చేశాడు. ఇందుకు ఆరుగురిని హత్య చేశాడు.
News February 18, 2025
NZB: రాష్ట్ర జూడో అసోసియేషన్‌లో జిల్లా వాసులు

తెలంగాణ రాష్ట్ర జూడో అసోసియేషన్‌లో నిజామాబాద్ జిల్లా బాధ్యులకు చోటు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర సంఘం ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మేకల అభినవ్ సంయుక్త కార్యదర్శిగా, అనిత ఈసీ మెంబర్‌గా, నవీన్ నిర్వహణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం బాధ్యులు నూతన కార్యవర్గాన్ని వెల్లడిస్తూ ఎన్నికైన వారిని అభినందించారు.