News December 14, 2025
NZB: ఓటు హక్కును వినియోగించుకోనున్న 2,38,838 మంది ఓటర్లు

నిజామాబాద్ జిల్లాలో 2వ విడత ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ధర్పల్లి(22), డిచ్‌పల్లి(34), ఇందల్వాయి(23), మాక్లూర్(26), మోపాల్(21), నిజామాబాద్ రూరల్(19, సిరికొండ(30), జక్రాన్‌పల్లి(21) మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. 2,38,838 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. GP ఎలక్షన్ ఫలితాలకు Way2News ఫాలో అవ్వండి.
Similar News
News December 14, 2025
సిర్నాపల్లిలో దొంగ ఓటుకు యత్నం.. ఉద్రిక్తత

ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలో ఓటింగ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఓ వర్గానికి చెందిన ఓ వ్యక్తి తన ఓటును వేశాడు. విదేశాల్లో ఉండే మరో వ్యక్తి ఓటును వేసేందుకు మళ్లీ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించాడు. అయితే బూత్ ఏజెంట్లు, ఎన్నికల అధికారుల అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
News December 14, 2025
నిజామాబాద్: సర్పంచ్‌గా తొలి విజయం మహిళదే

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఫలితాలు వెలువడుతున్నాయి. మోపాల్ మండలం శ్రీరాంనగర్‌తండా సర్పంచ్‌గా గుగులోత్ సరోజ 84 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి బస్సీ సునీతపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. ఉపసర్పంచ్ ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు.
News December 14, 2025
నిజామాబాద్‌లో రెండో విడత పోలింగ్ ప్రశాంతం

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ
ప్రశాంతంగా ముగిసింది. డిచ్‌పల్లి మండలంలో స్వల్ప ఘర్షణ జరిగినప్పటికీ పోలీసులు దాన్ని సమర్థవంతంగా నివారించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు శాంప్రసాద్ లాల్ ఎనిమిది మండలాల్లో తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలించారు.


