News December 10, 2025
NZB: ఓటేయడానికి ఇవీ తీసుకెళ్లండి !

ఓటర్లు తమ గుర్తింపు కోసం EPIC కార్డు (ఓటర్ ఐడీ) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ఈ క్రింది 18 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి చూపించవచ్చు. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్(ఫొటోతో), రేషన్ కార్డు(ఫొటోతో), పట్టాదారు పాస్‌బుక్, ఉపాధి జాబ్ కార్డు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం(ఫొటోతో), పెన్షన్ తదితర పత్రాల్లో ఏదోకటి చూపించాలి.
Similar News
News December 12, 2025
విశాఖకు 100 ఎలక్ట్రానిక్ బస్సులు వస్తున్నాయ్..!

త్వరలోనే 100 ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు విశాఖలో రొడ్డెక్కనున్నాయి. ఈ ఎలక్ట్రికల్ బస్సుల ఛార్జింగ్ స్టేషనులకు భారీగా ఖర్చు అవుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. హై స్పీడ్‌తో కూడిన ఛార్జింగ్ కేంద్రాలు 20 వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తొంది. విశాఖలో ప్రస్తుతం 175 బస్సులు అవసరం ఉండగా.. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవని భవిస్తున్నారు.
News December 12, 2025
3 దేశాల పర్యటనకు ప్రధాని మోదీ

PM మోదీ ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 బిన్ ఆల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు PM ముందుగా ఆ దేశానికి వెళ్తారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ భేటీ కీలకం కానుంది. అక్కడి నుంచి ఇథియోపియా వెళ్తారు. ఆ దేశానికి ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. ఆ దేశంలో చర్చల అనంతరం ఒమన్ చేరుకొని తిరుగు పయనమవుతారు.
News December 12, 2025
MHBD జిల్లాలో కాంగ్రెస్‌కే 80 సర్పంచ్ స్థానాలు

మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో రాత్రి 10 వరకు సర్పంచ్ ఫలితాలు వెలువడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 155 గ్రామ పంచాయతీలకు గాను 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 146 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్-80, బీఆర్ఎస్-47, బీజేపీ-5, స్వతంత్ర అభ్యర్థులు-14 మంది సర్పంచ్‌లుగా గెలుపొందారు.


