News May 11, 2024
NZB: ఓటేయ్యడానికి ఈ ఇవి తీసుకెళ్లోచ్చు: కలెక్టర్

నిజామాబాద్ ఓటర్‌కార్డు లేని ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద యొక్క గుర్తింపు పత్రాలను తీసుకెళ్లి చూపించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, జాబ్‌కార్డ్, పాసుబుక్, ఇన్సూరెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ గుర్తింపుకార్డుల్లో ఏదైనా తీసుకొని వెళ్ళి ఓటు వేయవచ్చని పేర్కొన్నారు.
Similar News
News March 14, 2025
NZB: పసుపు బోర్డు ఎక్కడుందో నాకే తెలియదు: AMC ఛైర్మన్

జిల్లాలో ఏర్పాటు చేశామని చెబుతున్న పసుపు బోర్డు ఎక్కడ ఉంది నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయిన తనకే తెలియదని, ఇంకా రైతులకు ఎలా తెలుస్తుందని ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. గురువారం డీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పసుపు బోర్డు అని ప్రైవేట్ హోటల్‌లో దానిని ప్రారంభించారని అందుకు రైతులను, మార్కెట్ కమిటీలను పిలువకుండా కేవలం పార్టీ కార్యకర్తలతో కార్యక్రమం చేయించారని విమర్శించారు.
News March 13, 2025
NZB: జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మల దగ్ధం

జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాలు శుక్రవరాం నిర్వహిస్తున్నామని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని బడ్జెట్ సమావేశాల సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
News March 13, 2025
NZB: 651 మంది విద్యార్థుల గైర్హాజరు

నిజామాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-1 పరీక్షకు మొత్తం 651 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 18,197 మంది విద్యార్థులకు 17,546 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని రవి కుమార్ వివరించారు.