News July 9, 2025
NZB: కన్నబిడ్డను చంపిన తల్లికి జైలు శిక్ష

5నెలల చిన్నారిని చంపిన తల్లికి జైలుశిక్ష పడినట్లు SI సందీప్ తెలిపారు. భీమ్‌గల్ మండలం గోనుగోప్పులకి చెందిన మల్లేశ్- రమ్యల కూతురు శివాని ఈ నెల 6న అనుమానాస్పదంగా మృతిచెందింది. తన కూతురిని భార్యే హత్యచేసిందని మల్లేశ్ PSలో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమ్యను విచారించగా ఊపిరాడకుండా చేసి తానే చంపినట్లు నేరం ఒప్పుకుంది. రమ్యను కోర్టులో హాజరుపరచి జైలుకు పంపినట్లు SI పేర్కొన్నారు.
Similar News
News July 9, 2025
HCA 2డే లీగ్.. పాలమూరు ఘన విజయం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి B-డివిజన్ టుడే లీగ్ ఛాంపియన్షిప్‌లో ఉమ్మడి MBNR జట్టు రాకేశ్-XI జట్టుపై 148 పరుగులతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన MBNR జట్టు 68.1 ఓవర్లలో 243/10 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాకేశ్-XI జట్టు 45.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో MDCA ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు.
News July 9, 2025
గోల్డెన్ వీసాపై రూమర్లు నమ్మొద్దు: UAE

తాము ప్రవేశపెట్టబోయే <<16986034>>గోల్డెన్ వీసాపై<<>> వస్తున్న రూమర్లను ఎవరూ నమ్మొద్దని UAE తెలిపింది. దీనిపై ఎలాంటి థర్డ్ పార్టీ సంస్థకు హక్కులు ఇవ్వలేదని, తమ దేశ అధికారిక సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మధ్యవర్తులను సంప్రదించవద్దని కోరింది. ఈ విషయంలో ఎవరైనా మోసానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరిన్ని వివరాలకు 600522222ను సంప్రదించాలని సూచించింది.
News July 9, 2025
ఇవాళ భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి లిస్ట్ కోసం <