News September 20, 2025

NZB కమీషనరేట్ పరిధిలో పలువురు SIల బదిలీ

image

NZB పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు SIలను బదిలీ చేస్తూ CP సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆర్మూర్‌లో ఉన్న గోవింద్, 4వ టౌన్‌లోని మహేష్, VRలో ఉన్న మహేష్‌ను CCS NZBకు బదిలీ చేశారు. అలాగే VR లోఉన్న వినయ్ కుమార్‌ను ఆర్మూర్‌కు, సాయాగౌడ్‌ను CSB NZB, BBS రాజును కలెక్టరేట్, సామ శ్రీనివాస్‌ను సౌత్ రూరల్ నుంచి NZB రూరల్ ఎస్సై-2గా, మొగులయ్యను ఒకటో టౌన్ నుంచి మాక్లూర్ఎస్సై-2గా బదిలీ చేశారు.

Similar News

News September 20, 2025

సాలూర: వాటర్ ట్యాంకర్ ఢీకొని యువకుడి మృతి

image

సాలూర మండలం హుంన్సాకి చెందిన నందకుమార్ (21) పటాన్‌చెర్ వద్ద వాటర్ ట్యాంకర్ ఢీకొని మృతి చెందాడు. నందకుమార్ తన ఉద్యోగానికి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని మృతుడి బంధువులు తెలిపారు. నందకుమార్‌కు ముగ్గురు అక్కలు ఉండగా… సంవత్సరం క్రితమే అతని తండ్రి దేవయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. నందకుమార్ మృతదేహం పంచనామా నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని బంధువులు తెలిపారు.

News September 20, 2025

NZB: పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 అమలు: సీపీ

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు D.EI.ED సెకండ్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో BNSS సెక్షన్ 163 అమలులో ఉంటుందని సీపీ సాయి చైతన్య తెలిపారు. ఈ నెల 22 నుంచి 27 వరకు D.EI.ED, 28 వరకు TOSS పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని వివరించారు.

News September 20, 2025

దసరా సెలవులకు ఊరేళ్తున్నారా? జాగ్రత్త: NZB CP

image

దసరా సందర్భంగా ఊరికి వెళ్లే వారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని NZB పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలన్నారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని ఇంటికి వచ్చేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. ఖరీదైన వస్తువులు ఇంట్లో ఉంచొద్దని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిదన్నారు. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.