News January 6, 2025
NZB: కలెక్టరేట్‌ను ముట్టడించిన కార్మికులు
సివిల్ సప్లై కార్పొరేషన్ హమాలీలు 6వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు సోమవారం నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల నుంచి ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వెంటనే జీవోను విడుదల చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అంకత్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఓమయ్య తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 8, 2025
డిచ్పల్లి: ఓట్లు వేసేది ప్రజలు.. ఓట్లు వేయించేది మీరు: మంత్రి జూపల్లి
ఓట్లు వేసేది ప్రజలు.. ఓట్లు వేయించేది కార్యకర్తలు, నాయకులు అని నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులు నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, గత BRS ప్రభుత్వ అవినీతిని ప్రజలకు విడమరిచి చెప్పాలని, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు.
News January 8, 2025
కేంద్ర రైల్వేశాఖ మంత్రితో ఎంపీ అర్వింద్ భేటీ
NZB ఎంపీ ధర్మపురి అరవింద్, జేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం దిల్లీలో కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విని వైష్ణవ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన రైల్వే లైన్ విస్తరణ పనుల గురించి చర్చించారు. ARMR to ADB వయా నిర్మల్ రైల్వే లైన్ గురించి ప్రస్తావించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
News January 7, 2025
NZB: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించిన నేతలు
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావడం, అక్కడి పుస్తకంలో సంతకం చేసేందుకు చూడగా ఆయన పేరు లేకపోవడంతో అలిగి స్టేజ్ దిగిపోయారు. దీనితో కాంగ్రెస్ నాయకులు ఆయన్ను బుజ్జగించి తిరిగి స్టేజి పైకి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.