News July 18, 2024
NZB: కలెక్టర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1721298040339-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో 2022 ఆగస్టులో బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తాజాగా జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఘటనలో బాధితురాలికి పరిహారం చెల్లింపులో కాలయాపన జరుగుతోందని వరంగల్‌కు చెందిన పౌర హక్కుల సంఘం ప్రతినిధి బక్క జడ్సన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక కోరుతూ కమిషన్ జిల్లా కలెక్టర్‌కు సమన్లు జారీ చేసిందని జడ్సన్ తెలిపారు.
Similar News
News February 7, 2025
NZB: కోటగల్లీలో అగ్ని ప్రమాదం, రెండిళ్లు దగ్ధం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738915446103_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ మార్కండేయ మందిరం సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీపం కారణంగా ప్రమాదవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మధిర ప్రసాద్, సుమలత అనే ఇద్దరికి చెందిన ఇండ్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు ఇండ్లలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.
News February 7, 2025
NZB: ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738918486985_728-normal-WIFI.webp)
మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. నగరంలో నిన్న నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 17 మందిని శుక్రవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు ప్రవేశపెట్టగా అందులో ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని చెప్పారు. మిగిలిన 11 మందికి రూ.15,500 జరిమానా విధించారన్నారు.
News February 7, 2025
NZB: మృత్యువులోనూ వీడని స్నేహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738906894963_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద నిన్న ఎదురెదురుగా <<15383679>>ఆటో, లారీ ఢీకొని<<>> మాక్లూర్‌కు చెందిన ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో మృతిచెందిన ఇంతియాజ్, వెల్డింగ్ పని చేసే ఫర్హాన్ ఇద్దరూ ప్రాణ స్నేహితులు అని మృతుల బంధువులు తెలిపారు. కాగా ఫర్హాన్‌కు వివాహమవగా 3నెలల పాప కూడా ఉందన్నారు.మృత్యువులోనూ వారి స్నేహం వీడలేదని కన్నీటి పర్యంతమయ్యారు.గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.