News August 17, 2025

NZB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంత మందికి వచ్చిందో తెలుసా?

image

నిజామాబాద్ జిల్లాలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఊతమిచ్చాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కళ్యాణ లక్ష్మి కింద 1,080 మంది లబ్ధిదారులకు రూ.10.81 కోట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా, షాదీ ముబారక్ ద్వారా 672 మంది లబ్ధిదారులకు రూ.6.72 కోట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం రూ.17.53 కోట్లు పంపిణీ అయినట్లు పేర్కొన్నారు.

Similar News

News August 17, 2025

NZB: 638 సంఘాలు.. రూ 72.22 కోట్ల రుణాలు

image

నిజామాబాద్ జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా స్వయం సహాయక సంఘాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 638 సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా రూ. 72.22 కోట్లు వడ్డీలేని రుణాలు ఇప్పించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 9,094 స్వయం సహాయక సంఘాల్లో 90,940 మంది సభ్యులున్నారు. పీఎం స్వనిధి కింద 4 మున్సిపాలిటీలలో వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందజేశారు.

News August 17, 2025

నిజామాబాద్: రూ. 57.98 కోట్ల పెన్షన్ల పంపిణీ

image

నిజామాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో జిల్లాలో పెన్షన్ల రూపేణ ప్రతినెల 2,69,174 మందికి 57 కోట్ల 98 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఇందులో జిల్లాలోని 2,50,610 మంది వివిధ రకాల ఆసరా పింఛనుదారులకు నెలవారి పింఛను రూ.2,016 చెల్లిస్తున్నారు. అలాగే 18,564 మంది వికలాంగులకు నెలవారి పింఛన్ రూ. 4,016 ఇస్తున్నారు.

News August 17, 2025

NZB: మహాలక్ష్మీ పథకం కింద ఎన్ని కోట్లు ఆదా ఆంటే?

image

నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ మహాలక్ష్మి పథకం మహిళా ప్రయాణీకులకు భారీ ఊరటనిచ్చింది. అధికారిక నివేదికల ప్రకారం, పథకం ప్రారంభం నుంచి ఆగస్టు 10 వరకు 6 కోట్ల 8 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. దీనివల్ల వారికి రూ. 249.13 కోట్లు ఆదాయం ఆదా అయినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జిల్లాలో సగటున ప్రతిరోజూ లక్ష మంది మహిళలు ఈ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు.