News April 2, 2025
NZB: కవిత GHIBLI ఇమేజ్ చూశారా..

కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినూత్నంగా ప్రశ్నించారు. ఆడ పిల్లలకు స్కూటీ ఇవ్వడంపై ఘిబ్లీ ఇమేజ్‌తో ఇంస్టాగ్రామ్‌లో ప్రియాంక గాంధీని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రియాంక జీ, స్కూటీ ఎక్కడ ? అంటూ ఇంస్టాగ్రామ్‌లో స్కూటీ మీనియేచర్‌ని పట్టుకున్న ఘిబ్లీ ఇమేజ్‌ను కవిత పోస్ట్ చేశారు.
Similar News
News November 11, 2025
జగిత్యాలలో 167 మందికి రూ.26.6లక్షల ఫ్యామిలీ బెనిఫిట్

జగిత్యాల కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా దిశా కమిటీ సమావేశంలో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అమలుపై అధికారులు సమీక్షించారు. జిల్లాలో మొత్తం 191 దరఖాస్తులు అందగా, 167 మంది లబ్ధిదారులకు రూ.26,60,000 ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలిపారు. మిగితా దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కమిటీ సూచించింది.
News November 11, 2025
జగిత్యాల జిల్లాలో 100% ఆయుష్మాన్ భారత్ టార్గెట్

జగిత్యాల కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా దిశా కమిటీ సమావేశంలో నేషనల్ హెల్త్ మిషన్ అమలుపై అధికారులు సమీక్షించారు. జిల్లాలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16 ఉప కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో 3,48,605 మంది నమోదు కాగా 100% లక్ష్యాన్ని సాధించినట్లు వెల్లడించారు. ప్రజలకు సమయానుకూలంగా వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
News November 11, 2025
రూ.4 కోట్ల కారు కొన్న అర్ష్‌దీప్ సింగ్

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. మెర్సిడెస్ AMG G63 వ్యాగన్ మోడల్‌తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారు 585 HP పవర్, 850 NM టార్క్‌తో 0-100 కి.మీ వేగాన్ని 4.3 సెకన్లలోనే అందుకుంటుంది. ధర దాదాపు రూ.4 కోట్లు.


