News April 9, 2026
NZB: కాంగ్రెస్‌లో ముదురుతున్న కుమ్ములాటలు!

నిజామాబాద్ కాంగ్రెస్‌లో వర్గపోరు వీధిన పడింది. ఇటీవల పార్టీ కోసం శ్రమిస్తున్న ధర్మపురి సంజయ్‌కు పదవుల పంపకంలో అన్యాయం జరిగిందంటూ ఆయన అనుచరులు నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ధర్నాకు దిగారు. తాజాగా జిల్లా కార్యాలయంలో నేతల మధ్య జరిగిన ఘర్షణలు, క్రమశిక్షణా చర్యలు పార్టీలో సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Similar News
News April 20, 2026
నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 20, 2026
బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.