News July 10, 2025

NZB: కార్మికుల హక్కులు హరిస్తున్న బీజేపీ: MLCకవిత

image

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులను హరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను సవరించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని BJP ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.

Similar News

News September 10, 2025

నిజామాబాద్: వృద్ధురాలి హత్య

image

సాలూరలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు హత్యకు గురైంది. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చెందర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కాటం నాగవ్వ(65)ను ఆమె మరిది గంగారం, కుటుంబ సభ్యులు గొంతు నులిమి హత్య చేశారు. ఆమె ఆస్తి, బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 10, 2025

NZB: కళాశాలకు హాజరు కాని వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: DIEO

image

ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ద్వారా మొదటి పీరియడ్‌లోనే హాజరు తీసుకోవాలని DIEO తిరుమలపూడి రవికుమార్ ఆదేశించారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధ్యాపకుల, బోధనేతర సిబ్బందితో సమీక్షించారు. ప్రతి అధ్యాపకుడు కళాశాలకు హాజరు కానీ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

News September 10, 2025

NZB: వాగులో గుర్తు తెలియని మృతదేహం

image

నిజామాబాద్ బోర్గాం వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. వారు 4వ టౌన్​ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు 35-40 ఉంటుందని పోలీసులు చెప్పారు. కాగా మృతుడు ఆత్మహత్య చేసుకొన్నాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.