News February 14, 2025

NZB: కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

image

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్‌లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత (59) అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.

Similar News

News February 24, 2026

HMDA పరిధిలోకి వికారాబాద్ జిల్లాలోని 4 గ్రామాలు

image

విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను HMDA పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్‌పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్‌పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను HMDA పరిధిలో చేర్చారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. GHMC ఆధ్వర్యంలో CRMP phase 2 చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్!

image

ఝార్ఖండ్‌లోని రాంచీలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఏడుగురితో ఢిల్లీకి బయల్దేరిన కాసేపటికే ఛత్రా జిల్లాలోని కర్మటండ్ గ్రామంలో క్రాష్ అయింది. ఒకరు చనిపోయారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.