News January 23, 2025
NZB: కేంద్ర మంత్రిని కలిసిన పసుపు బోర్డు ఛైర్మన్

కేంద్రమంత్రి, BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఢిల్లీలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన పసుపు బోర్డు ఛైర్మన్ పదవిని చేపట్టినందుకు గాను కేంద్ర మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పసుపు బోర్డు, పసుపు రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోBJP ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
HYD: పడితే కుటుంబాలు రోడ్డున పడతాయ్!

ట్రాలీ నిండా సామాన్లు.. పైన కట్టెలు.. వాటిపైనే ప్రాణాలను ఫణంగా పెట్టిన కూలీలు. అదుపు తప్పితే వారితో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని మరిచిపోతే ఎలా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా నియమాలను పాటించాలని పోలీసులు చెబుతుంటే పెడచెవిన పెట్టి ప్రమదాలకు గురవుతున్నారు. ఫైన్‌లు వేసినా భయం లేదు. ఈ దృశ్యం పీర్జాదిగూడ పర్వతాపూర్‌లో కనిపించింది. ఇలాంటి ప్రయాణాలు విషాదాంతంగా మారుతాయని గుర్తించండి.
News September 16, 2025
కలెక్టర్ల సమావేశానికి హాజరైన అనంత కలెక్టర్

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు మంగళవారం జరిగింది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ హాజరయ్యారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
News September 16, 2025
డ్రగ్స్ తయారీలో పట్టువదలని విక్రమార్కుడు జయప్రకాశ్

ఓల్డ్ బోయినపల్లిలోని మేధా స్కూల్ నిర్వాహకుడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని డ్రగ్స్ తయారీకి తెరలేపాడు. ఆల్ర్ఫాజోలం ఎలాగైనా తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 1, 2 సార్లు విఫలమైతే కొందరు దానిని ఆపేస్తారు. ఎలాగైనా తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. అలా 6 సార్లు ఫెయిలయ్యాడు. చివరికి ఏడోసారి సక్సస్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి దందా నిరాటంకంగా కొనసాగించాడని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.