News April 7, 2025
NZB: ఖిల్లా రామాలయంలో ట్రాన్స్ జెండర్ల వివాహం

శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో ఆదివారం నిజామాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట వివాహం చేసుకున్నారు. ప్రతి ఏటా భద్రాచలం, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి వివాహాలు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది తొలిసారిగా జిల్లా కేంద్రంలోని రామాలయంలో ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకున్నారు.
Similar News
News April 12, 2025
బోధన్: IPL బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్

బోధన్ బీటీనగర్‌లో ఆన్‌లైన్ ద్వారా IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న సయిద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నరన్నా పక్కా సమచారంతో సీఐ వెంకటనారాయణ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. విచారణలో NZBకు చెందిన ముజీబ్, సచిన్ ద్వారా ఆన్‌లైన్ ఐడీ క్రియేట్ చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. సయిద్‌ను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
News April 12, 2025
మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. భూంపల్లి నివాసి మృతి

సిరికొండ మండలం తుంపల్లికి చెందిన పిర్యానాయక్ (35) మిర్యాలగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పిర్యానాయక్ మిర్యాలగూడలో వరి కోత హార్వెస్టర్‌ను అక్కడి కి తీసుకెళ్లాడు. శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలుకాగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
News April 12, 2025
NZB: 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు

నిజామాబాద్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో శనివారం నిర్వహించే హనుమాన్ జయంతి, శోభాయాత్ర, అన్నదాన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించాలని సీపీ సాయి చైతన్య కోరారు .ఇందుకోసం నిజామాబాద్ ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల నుంచి పోలీస్ సిబ్బంది TSSP బెటాలియన్ సిబ్బంది తో బందోబస్తు నిర్వాహణ కోసం దాదాపు 1300 మందితో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.