News January 24, 2025

NZB: గంజాయితో ఒకరి అరెస్ట్

image

నిజామాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు గురువారం ఒకరిని గంజాయితో అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.స్వప్న తెలిపారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా జునైద్ అనే ఓ యువకుడు 0.7 కిలోల గంజాయితో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్వప్న వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాం కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, భూమన్న, కానిస్టేబుళ్లు భోజన్న, సుకన్య పాల్గొన్నారన్నారు.

Similar News

News November 5, 2025

రాజకీయ పార్టీలకు బూత్ లెవల్ ఏజెంట్లు: నిజామాబాద్ కలెక్టర్

image

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవెల్‌లో తమ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాను మ్యాపింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 4, 2025

NZB: తాగి వాహనాలు నడిపినందుకు జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మంగవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. గౌతమ్ నగర్‌కు చెందిన గుండ్ల శ్రీనివాస్, కోటగల్లీకి చెందిన కొమ్ము మధుకు 2 రోజుల చొప్పున, బోధన్‌కు చెందిన సురేందర్‌కు 3 రోజుల జైలు శిక్ష విధించారన్నారు. అలాగే 32 మందికి రూ.56,500 జరిమానా విధించినట్లు వివరించారు.

News November 4, 2025

NZB: అపార్, యూడైస్ పనులను పూర్తిచేయండి: కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యా శాఖ అధికారులు, ప్రిన్సిపల్స్ సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో ఈరోజు జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వెంటనే విద్యార్థుల అపార్, యూడైస్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతి కళాశాల ప్రిన్సిపల్ కచ్చితంగా ఆపార్, యూడైస్, పెన్ నంబర్లను విద్యార్థులకు అందజేయాలన్నారు.