News March 4, 2025
NZB: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో గుత్ప వాసి మృతి

NZB ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి మోహన్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులు పెరగడంతో గత ఐదు నెలల క్రితం దుబాయ్ వెళ్లి డెలివరీ బాయ్‌గా పని చేస్తుండగా ఫిబ్రవరి 23న కారు ప్రమాదంలో మరణించాడు. సోమవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరారు.
Similar News
News March 4, 2025
ఇంటి అద్దెలను ప్రభుత్వాలు నియంత్రించలేవా?

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ సహా చాలా నగరాలు, పట్టణాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా ఉంటున్నాయి. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల అద్దెలూ నోరెళ్లబెట్టేలానే ఉన్నాయి. నెలజీతంలో సగం ఇంటి అద్దెకే పోతోందని చిరు ఉద్యోగులు వాపోతున్నారు. నీళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోయినా అద్దెలు ఆకాశాన్నే తాకుతున్నాయి. ఒక ప్రాతిపదిక అనేది లేకుండా ఓనర్లు ఇష్టారీతిన పెంచే ఈ అద్దెలను ప్రభుత్వాలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
News March 4, 2025
బ్యూటిఫుల్ ఫొటో: చంద్రుడిపై సూర్యోదయం

భూమిపై సూర్యోదయం ఎంత రమణీయంగా ఉంటుందో మనకు తెలుసు. మరి చంద్రుడి పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది? పై ఫొటోలో ఉన్నట్లు ఉంటుంది. ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ ల్యాండర్ ఈ అద్భుతమైన ఫొటోను తీసింది. నాసాకు చెందిన పే లోడ్‌తో ఈ నెల 2న చంద్రుడిపై దిగిన ల్యాండర్ ఆ వెంటనే ఈ ఫొటోను పట్టేసింది.
News March 4, 2025
Trade War: అమెరికాపై చైనా ప్రతీకార సుంకాలు

ప్రపంచ వ్యాప్తంగా ట్రేడ్‌వార్ ముదురుతోంది. కెనడా, మెక్సికోకు తోడుగా అమెరికా ఉత్పత్తులపై చైనా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. సోయాబీన్, పప్పులు, పోర్క్, బీఫ్, అక్వాటిక్ ప్రొడక్ట్స్, పండ్లు, కూరగాయలు, డెయిరీ ప్రొడక్ట్స్‌పై మార్చి 10 నుంచి 10% సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా ఫారిన్ మినిస్ట్రీ తెలిపింది. చికెన్, గోధుమలు, పత్తి సహా మరికొన్ని వస్తువులపై అదనంగా 10-15% సుంకాలు విధిస్తామని వెల్లడించింది.