News March 21, 2024

NZB: గూడ్స్ రైల్లో పొగలు

image

నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలులో ఎండ తీవ్రతకు స్వల్పంగా నిప్పురాజుకొని పొగలు వచ్చాయి. బొగ్గును తరలిస్తున్న వ్యాగన్‌లో పొగలు రాగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిజామాబాద్ స్టేషన్‌లో ఆపివేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Similar News

News February 9, 2026

NZB: జనసేన బోణీ కొడుతుందా.. యూటర్న్ తీసుకుంటుందా?

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో దిగిన జనసేన ఇక్కడ బోణీ కొడుతుందా? లేక యూ టర్న్ తీసుకుంటుందా? అన్న చర్చ జరుగుతోంది. నగరంలోని 11 డివిజన్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వారికి మద్దతుగా ప్రచారానికి వస్తారని అనుకున్నా అది క్యాన్సిల్ అయ్యింది. ఈ క్రమంలో పోటీ చేస్తున్న వారు Uటర్న్ తీసుకుని బీజేపీకి మద్దతు పలుకుతారా? లేక బరిలో ఉంటారా? అనేది చూడాల్సిందే.

News February 9, 2026

అశోక్ సాగర్ చెరువులో మహిళ మృతదేహం

image

ఎడపల్లి మండలం జానకంపేట శివారులో అశోక్ సాగర్ చెరువులో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైన విషయం తెసిందే. ఐతే మృతదేహం ఆచూకీ లభ్యమైనట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు. మృతురాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్, కమ్యూనిటీ హాల్ ప్రాంతానికి చెందిన అష్రఫ్ బేగం(60)గా గుర్తించినట్లు చెప్పారు.

News February 9, 2026

కమ్మర్‌పల్లి: వాలీబాల్ ఛాంపియన్‌లకు బహుమతుల ప్రదానం

image

కమ్మర్‌పల్లిలో ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్-2026 పోటీలు జరిగాయి. బాలికల విభాగంలో నిజామాబాద్-1, మహబూబ్ నగర్-2, కరీంనగర్-3, మెదక్-4 స్థానాల్లో నిలిచాయి. బాలురు విభాగంలో మొదటి బహుమతి వరంగల్, నిజామాబాద్-2, ఖమ్మం-3, రంగారెడ్డి-4 స్థానాలు గెలుచుకున్నాయి. రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, వీఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి బహుమతులు ఇచ్చారు.