News June 9, 2024
NZB: ‘గోవులను అక్రమంగా తరలిస్తే చర్యలు’
మూగజీవాలను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డిపేట మండల ఎస్సై రాజు తెలిపారు. బక్రీద్ సందర్భంగా గోవులను తరలించడానికి పశువైద్యాధికారి ధ్రువీకరణపత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. మూగజీవాలను తరలిస్తున్నట్లు తెలిస్తే వారికి సమాచారం ఇవ్వాలని, వాహనాలను అడ్డుకొని గొడవలు చేయడం సరికాదన్నారు. పశువుల రవాణాకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బక్రీద్‌ను శాంతియుతంగా చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 11, 2025
నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
News February 11, 2025
జక్రాన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నిజామాబాద్ జిల్లా 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జక్రాన్‌పల్లి మండలం పడకల్ వద్ద ట్రాక్టర్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాజేశ్వర్, ఓడ్డేన్న మృతి చెందగా.. విజయ్ గౌడ్, మహేశ్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 11, 2025
నవీపేట్: చదువు అర్థం కావడం లేదని విద్యార్థి ఆత్మహత్య
నవీపేట్ మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన అభిషేక్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అవ్వడంతో తల్లదండ్రులు మళ్లీ ఒప్పించి కాలేజీలో జాయిన్ చేశారు. తన తోటి ఫ్రెండ్స్‌తో చదువు అర్థం కావడం లేదని మనస్థాపం చెంది గత నెల 27వ తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలిచగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 11 గంటలకు మృతి చెందినట్లు పోలీసులు వివరించారు.