News October 26, 2025

NZB: గ్యాలంటరీ అవార్డు ఎవరికి ఇస్తారో తెలుసా?

image

దేశ రక్షణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి గ్యాలంటరీ అవార్డులు ఇస్తారు. NZBలో కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను హత్య చేసిన నేరస్థుడు రియాజ్‌ను పట్టించిన ఆసిఫ్‌ను గ్యాలంటరీ అవార్డుకు సిఫార్సు చేస్తామని ఇటీవల డీజీపీ శివధర్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ప్రధానంగా 6 రకాల గ్యాలంటరీ అవార్డులు ఉంటాయి. పరమ వీర చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర అవార్డులను ప్రదానం చేస్తారు.

Similar News

News October 28, 2025

KNR: సీసీఎస్ PS నూతన కార్యాలయం ప్రారంభం

image

సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు. గతంలో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనంపైన పనిచేసిన సీసీఎస్ పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయ కాంపౌండ్‌లో నిర్మించిన నూతన భవనంలోకి తరలించారు. నూతన భవనం ద్వారా సీసీఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి మెరుగైన వాతావరణం లభిస్తుందని, వారు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని సీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 28, 2025

మిర్యాలగూడ: లక్కీ డ్రాలో మృతుడికి అవకాశం

image

మద్యం టెండర్ల లక్కీడ్రాలో ఓ మృతుడికి అవకాశం దక్కింది. ఈ ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. MLGలోని మద్యం షాపు(63)నకు గోపులాపురం గ్రామానికి చెందిన కాసాని అశోక్(38) ఈనెల18న టెండరు దరఖాస్తు సమర్పించి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అతను చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. నిబంధనల ప్రకారం మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి దుకాణం కేటాయించనున్నట్లు తెలిసింది.

News October 28, 2025

విశాఖ: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా రేషన్

image

విశాఖ జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తుగా అంటే మంగళవారం నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులు ముందస్తుగానే అందజేస్తున్నారు. ఇప్పటికే పాత డెయిరీ ఫారం ఆదర్శనగర్ ప్రాంతాల్లో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేస్తున్నారు. స్టాక్ అంతా ఇప్పటికే రేషన్ షాపులకు చేరుకుంది.