News July 11, 2024

NZB: చనిపోయిన విద్యార్థి కుటుంబానికి రూ.6 లక్షల నష్టపరిహారం

image

2013లో ప్రమాదవశాత్తు NZB ప్రభుత్వ బీసీ బాలుర బీసీ వసతి గృహంలో నాలుగో అంతస్థు నుంచి జె. శ్రీకాంత్ పడి మృతిచెందాడు. విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని జాదవ్ పరుశురాం అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థి కుటుంబానికి వడ్డీతో కలిపి నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నష్టపరిహారం రూ.6 లక్షలు, వడ్డీరూ.3,07,900, కోర్టు ఖర్చులు రూ.35,042 మెత్తం 9,42,842 మంజూరు చేసింది.

Similar News

News October 15, 2024

NZB: త్వరలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ: మహేష్ కుమార్

image

త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వివిధ కారణాలతో వాయిదా పడుతున్న మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

News October 14, 2024

చందూర్: నిజాంసాగర్ కాలువలో మృతదేహం

image

చందూర్ గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువలో (28 ) గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి శరీరంపై బ్లాక్ కలర్ ప్యాంటు, ఎల్లో కలర్ షర్ట్ ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహన్ని మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.

News October 14, 2024

NZB: బజ్జీల కోసం గొడవ, ముగ్గురి అరెస్ట్

image

నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఆకాశ్, మనీష్, ప్రమోద్ రెండు రోజుల క్రితం తెల్లవారుజామున బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్‌కు వెళ్లి బజ్జీలు తింటూ మరో 2 కావాలన్నారు. అయితే బజ్జీలు అయిపోయాయని హోటల్ యజమాని సచిన్ చెప్పగా గొడవ జరిగింది. అనంతరం నిందితులు సచిన్ ఇంటిపై పెట్రోల్ బాటిళ్లతో దాడి చేసి నిప్పంటించగా ఘటనపై 3వ టౌన్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.