News March 23, 2024
NZB: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండలంలోని బండ రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన పండరి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడిపోయినట్లు తెలిపారు. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాదుకు కుటుంబ సభ్యులు తరలించినట్లు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడన్నారు.
Similar News
News October 23, 2025
NZB: వైన్స్ దరఖాస్తులకు నేడే లాస్ట్

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియనుందని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులకు 2,658 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. కాగా ఈ నెల 27న భారతి గార్డెన్లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
News October 23, 2025
నిజామాబాద్‌లో ధాన్యం సేకరణ ఏర్పాట్లు భేష్: ఎండీ లక్ష్మి

ఖరీఫ్ వరి ధాన్యం సేకరణ కోసం నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లు అభినందనీయమని స్పెషల్ ఆఫీసర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ (MD) లక్ష్మి (ఐఏఎస్) అన్నారు. బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆమె ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ, సొసైటీ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లను ఆమె ప్రశంసించారు.
News October 22, 2025
NZB: ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఫైర్ ఆఫీసర్ శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు ధన్వాల్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి ఉన్నారు.