News April 11, 2025

NZB: చిన్నారి కిడ్నాప్.. క్షేమంగా తల్లికి అప్పగించిన పోలీసులు

image

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో ఈనెల 7న రాత్రి <<16019748>>కిడ్నాపైన <<>>బాలికను గురువారం క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు ACP రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. మద్నూర్‌లోని మీర్జాపూర్‌కు చెందిన గైక్వాడ్ బాలాజీ చిన్నారి రమ్యను ఎత్తుకెళ్లాడు. మిర్జాపూర్‌లో తన స్నేహితుడైన సూర్యకాంత్ ద్వారా బాలికను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నాడని ACP వివరించారు. ఆయనతో పాటు SHO రఘుపతి ఉన్నారు.

Similar News

News July 8, 2025

NZB ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా కృష్ణ మోహన్

image

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ కృష్ణ మోహన్‌ను నియమిస్తూ వైద్య ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం మహేశ్వరం మెడికల్ కళాశాలలో జనరల్ సర్జన్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ శివ ప్రసాద్ కొనసాగుతున్నారు.

News July 8, 2025

NZB: ముగ్గురు ASIలకు SIలుగా పదోన్నతి

image

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు ASIలకు SIలుగా పదోన్నతి కల్పిస్తూ CP సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ASI నాగభూషణం, మాక్లూర్ PSలో పని చేస్తున్న నర్సయ్య, NZB త్రీ టౌన్‌లో పని చేస్తున్న లీలా కృష్ణకు SIలుగా పదోన్నతులు కల్పించారు. నాగభూషణం, నర్సయ్యలను నిర్మల్ జిల్లాకు, లీలా కృష్ణను ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశారు.

News July 8, 2025

భీమ్‌గల్: 5 నెలల చిన్నారిని హత్య చేసిన తల్లి..?

image

భీమ్‌గల్ మండలంలో దారుణం జరిగింది. కడుపులో దాచుకోవాల్సిన తల్లి బిడ్డను కడతేర్చింది. తన కూతురిని భార్యే హత్య చేసిందని భర్త ఫిర్యాదు చేసినట్లు SI సందీప్ తెలిపారు. గోనుగొప్పుల వాసి మల్లేశ్- రమ్య దంపతులకు శివాని(5) సంతానం. రమ్య తాగుడుకు బానిసై చిన్నారిని పట్టించుకోవడం లేదు. దీంతో మల్లేశ్ భార్యను పలు మార్లు మందలించాడు. బిడ్డ కారణంగానే గొడవలు జరుగుతున్నాయని భావించిన రమ్య ఈనెల 6న హత్య చేసిందన్నారు.