News April 7, 2024
NZB: చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి
చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన NZB జిల్లాలోని సాలూరాలో చోటుచేసుకుంది. మండలానికి చెందని గాదే మనోజ్(23), గోరంట్ల మనోజ్(19) శనివారం సాయంత్రం చెరువులోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు మునిగిపోగా అతడిని కాపాడే క్రమంలో మరో యువకుడు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 25, 2024
నిజామాబాద్‌లో 3 నెలల పసికందు మృతి
నిజామాబాద్‌లోని సుభాష్ నగర్ బాల్ రక్ష భవనంలో మంగళవారం 3 నెలల పసికందు మృతి చెందింది. గుర్తు తెలియని ఓ మహిళ సెప్టెంబర్ 15న జిల్లా ఆస్పత్రిలో పసికందుకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువగా ఉండటంతో చెత్త బుట్టలో పడేసి వెళ్లిపోయింది. గమనించిన వైద్యులు శిశువును శిశు గృహానికి తరలించి చికిత్స అందించారు. కాగా శిశువు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
News December 25, 2024
HYDలో రోడ్డుప్రమాదం.. కామారెడ్డి వాసి మృతి
సోమవారం HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దోమకొండకు చెందిన శివాని(21) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమెను బైక్‌పై తీసుకెళ్లిన మహ్మద్‌నగర్ మండలానికి చెందిన వెంకటరమణారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. కాగా వీరిద్దరు నిజాంసాగర్ నవదయలో ఈ నెల 22న పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
News December 25, 2024
నేడు SRSP కాకతీయ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల: SE
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా ఇవాళ ఉదయం 10 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు పోచంపాడ్ ఇరిగేషన్ సర్కిల్ SE శ్రీనివాస్ రావు గుప్త తెలిపారు. ఇందులో భాగంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో జోన్-1 (D5 నుంచి D53) ఆయకట్టుకు 7 రోజులు, జోన్-2 (D54 నుంచి D94) ఆయకట్టుకు 8 రోజులు సాగునీటి సరఫరా చేస్తామన్నారు. మొదట జోన్ 2 కు ఏప్రిల్ 8 వరకు సాగునీటి విడుదల ఉంటుందని వివరించారు.