News March 18, 2024

NZB: చెరువులో భార్యాభర్తల మృతదేహాలు లభ్యం

image

నిజామాబాద్‌లోని వెంగళరావు నగర్ సమీపంలో ఉన్న బాబన్ షాబ్ చెరువులో సోమవారం రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. భార్యాభర్తల మృతదేహాలను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమృతపూర్ గ్రామానికి చెందిన పెద్ద బాబయ్య, పోశమ్మగా గుర్తించారు. వారు స్థానిక దర్గా వద్ద ఉంటూ బిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 8, 2025

NZB: నిర్మాణాలు చేపట్టేలా లబ్దిదారులను ప్రోత్సహించాలి: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇళ్ల మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువు లోగా, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.

News April 8, 2025

సిరికొండ: కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి: కలెక్టర్

image

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు చేర్చాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం ఆయన సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్ చేసుకుంటున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

News April 8, 2025

NZB: అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం: కవిత

image

అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

error: Content is protected !!