News March 23, 2025

NZB: చెల్లి మృతి.. బాధలోనూ పరీక్ష రాసిన అన్న

image

ఓ వైపు చెల్లి మరణం.. మరో వైపు ‘పది’ పరీక్షలు. ఆ పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాశారు నిజామాబాద్‌కు చెందిన లక్ష్మీ గణ సాయి. ఆదర్శనగర్‌‌లోని పానుగంటి సాయిలు-వినోద దంపతులకు కుమారుడు లక్ష్మీ గణ సాయి, కుమార్తె పల్లవి సంతానం. అయితే పల్లవి 2 నెలల క్రితం క్యాన్సర్ బారినపడి శుక్రవారం రాత్రి మరణించగా, ఆ వార్త దిగమింగుకొని అన్న శనివారం పదో తరగతి పరీక్ష రాశారు. దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్న గ్రేట్ కదా..!

Similar News

News December 20, 2025

MBNR: ఈనెల 21 నుంచి ఓపెన్ పీజీ తరగతులు

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంవీఎస్ కళాశాలలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి సంవత్సరం సెమిస్టర్-1 తరగతులు ఈనెల 21 నుంచి ప్రారంభమవుతున్నాయని ప్రిన్సిపల్ డా కే పద్మావతి తెలిపారు. విద్యార్థులు యూనివర్సిటీ పంపిన పుస్తకాలు, పీజు చెల్లించిన రసీదులు తీసుకొని తరగతులకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 73829 29609 సంప్రదించాలని రీజినల్ కో ఆర్డినేటర్ డా జి సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

News December 20, 2025

మలయాళ నటుడు శ్రీనివాసన్ మృతి

image

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్ శ్రీనివాసన్(69) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కన్నూరు జిల్లాలోని పట్టియంలో 1956లో జన్మించిన శ్రీనివాసన్ 48 ఏళ్ల సినీ కెరీర్‌లో కామెడీ పాత్రలతో అలరించారు. సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి ఆలోచింపజేశారు. శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.

News December 20, 2025

NZB: ముదురుతున్న పోచారం-ఏనుగు వ్యవహారం

image

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి మధ్య వ్యవహారం ముదురుతోంది. GP ఎన్నికల్లో పోచారం, ఏనుగు వర్గీయులు వేర్వేరుగా పోటీ చేశారు. MPTC, ZPTC ఎన్నికల్లోనూ రెండు వర్గాలు వేర్వేరుగా తలపడే అవకాశం ఉంది. దీంతో అధికార కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. <<18616051>>ఏనుగు రవిందర్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో<<>> చెప్పాలని నిన్న పోచారంభాస్కర్‌రెడ్డి అనడం చర్చనీయాంశంగా మారింది.