News March 31, 2024

NZB: చోరికి వచ్చిన వ్యక్తిని కొట్టి చంపిన స్థానికులు

image

ఓ రైస్ మిల్లులో చోరీకి వచ్చిన వ్యక్తిని స్థానికులు చితక బాధడంతో మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లోని పాల్దా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామ పరిధిలోని మూసివేతకు గురైన శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్‌లో ఓ తండాకు చెందిన 8 మంది చోరీకి యత్నించారు. గ్రామస్థులు ప్రతిఘటించడంతో ఏడుగురు పారిపోగా.. బానోతు సునీల్ వారికి దొరికాడు. దీంతో వారు అతడిని తీవ్రంగా కొట్టడంతో సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News January 13, 2025

మోపాల్: కారు బైక్ ఢీకొని మృతి చెందిన వ్యక్తి

image

కారు బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మోపాల్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మోపాల్ SI యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గం(P) సంజీవరెడ్డికాలనీకి చెందిన విజయ్ కుమార్(48) మోపాల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా పెట్రోల్ బంక్ వద్ద కారు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News January 13, 2025

నిజామాబాద్ జిల్లా వాసికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

image

భూవనేశ్వర్‌లోని ఉత్కల్ విశ్వవిద్యాలయంలో 2024 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాలను అందజేశారు. ముఖ్య అతిథిగా ఆంగ్ల కవి, రచయిత జెర్రీ పింటో హాజరయ్యారు. తెలుగు భాష నుంచి నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన రమేశ్ కార్తీక్ నాయక్ తన తొలి కథల సంపుటి ‘ఢావ్లో- గోర్ బంజారా కథలు’ పుస్తకానికి అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న తొలి గిరిజన తెలుగు రచయిత కావడం విశేషం.

News January 13, 2025

NZB: వైద్యులకు టోకరా వేసిన నిందితుడి అరెస్ట్

image

బ్యాంకుల్లో తీసుకున్న లోన్లను సెటిల్మెంట్ చేస్తానని చెప్పి వైద్యులకు టోకరా వేసిన ఓ ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ SHO రఘుపతి ఆదివారం తెలిపారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన బంగారు అప్పారావు(30) నిజామాబాద్‌కు చెందిన ఓ వైద్యుడి బ్యాంకు లోన్ సెటిల్మెంట్ చేయిస్తానని నమ్మించి రూ.15 లక్షలు, కోరుట్లకు చెందిన మరో వైద్యుడికి రూ.60 లక్షలు, మోర్తాడ్ వైద్యుడికి రూ.12 లక్షలు మోసం చేశాడన్నారు.