News April 6, 2025
NZB: చోరీలకు పాల్పడున్న నిందితుడి అరెస్ట్

జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి శనివారం తెలిపారు. నాందేడ్ జిల్లాకు చెందిన నాందేవ్ ఆనందరావు జిల్లాలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. గత నెల 5న మాక్లూర్ మండలం మాదాపూర్‌లో పరశు దేవానందం ఇంట్లో చోరీ జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News December 15, 2025
నిజామాబాద్: నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్లు అందించాలి

ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్న ఉద్యోగులు, కార్మికులు లైఫ్ సర్టిఫికెట్‌లు ఇప్పటి వరకు అందజేయని వారు ఈ నెలాఖరు వరకు మీసేవ కేంద్రాల్లో సమర్పించాలని ప్రాంతీయ భవిష్య నిధి కార్యాలయ సిబ్బంది తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. పెన్షన్ పొందుతున్న బీడీ కార్మికులు, ఇతర కార్మికులు, ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.
News December 15, 2025
NZB: రాత్రి వరకు కొనసాగిన GP ఎన్నికల కౌంటింగ్

నిజామాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం జరిగిన GP ఎన్నికల కౌంటింగ్ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు కొనసాగింది. చిన్న GPల్లో సాయంత్రం సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాగా 158 సర్పంచ్ స్థానాలకు 568 మంది, 1,081 వార్డులకు 2,634 మంది పోటీలో నిలవగా మొత్తం 2,38,838 మంది ఓటర్లకు గాను 1,83,219 మంది (76.71 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News December 15, 2025
NZB: వాటి వల్ల ప్రాణహాని కలిగితే హత్య కేసు: CP

చైనా మాంజాతో వ్యక్తులకు ప్రాణహాని జరిగితే హత్యానేరం కేసు నమోదు చేస్తామని CPసాయిచైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వాడటం ప్రమాదకరమని, ప్రజలు, జంతువులు, పక్షులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. చైనా మాంజా నిల్వ ఉంచినా, తయారు చేసి విక్రయించినా, ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరి వద్ద అయినా చైనా మాంజా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సూచించారు.


