News March 10, 2026
NZB: జర జాగ్రత్త..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మోస్రాలో 38.9°C, భీంగల్ 38.7, ఎర్గట్ల, నిజామాబాద్ 38.4, మంచిప్ప, ఆలూరు 38.3, మెండోరా 38.2, పెర్కిట్, బాల్కొండ 38.1, కోటగిరి, గోపన్ పల్లి 38°Cలు నమోదయ్యాయి. కాగా కామారెడ్డి జిల్లాలో ఎల్పుగొండ 38.3°C, కొల్లూరు, బీర్కూర్ 38, సోమూరు 37.8, భిక్కనూరు 37.5, బీబీపేట్ 37.3°C ల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
Similar News
News March 10, 2026
భారత్ నుంచి బంగ్లాకు 5,000 టన్నుల డీజిల్?

ఇండియా నుంచి తమకు పైప్‌లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్ రానుందని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ రెజనూర్ రెహ్మాన్ తెలిపారు. ఏటా 1,80,000 టన్నుల డీజిల్ సరఫరా కోసం భారత్‌తో ఒప్పందం ఉందని.. తాజా దిగుమతి అందులో భాగమేనన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బంగ్లా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై భారత్ స్పందించాల్సి ఉంది.
News March 10, 2026
సిద్దిపేట: 14 నుంచి 10 పరీక్షలు.. 15,337 మంది విద్యార్థులు

ఈనెల 14 నుంచి ఏప్రిల్ 18 వరకు పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 15,337 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అందులో బాలురు 7,700 మంది, బాలికలు 7,632 మంది ఉన్నారు. 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 20 మంది విద్యార్థులకు ఒక్కరు చొప్పున మొత్తం 848 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
News March 10, 2026
సిద్దిపేట: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

సిద్దిపేట కలెక్టరేట్ పక్కన గల ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్(ఈవీఎం) గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించారు. త్రైమాసిక పరిశీలనలో భాగంగా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను నియమావళి ప్రకారం ఓపెన్ చేసి సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల వారీగా మిషన్ లను భద్రపరిచిన ద్వారాలను వాటికి ఉన్న సీల్‌లను పరిశీలించారు.


