News January 29, 2025
NZB: జానకం పేట గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య(60) హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో పడి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
250 కేజీల బియ్యంతో అన్నాభిషేకం

కపిలతీర్థంలో జరిగే అన్నాభిషేకానికి 250 కిలోల బియ్యాన్ని వండుతారు. భూమితలం నుంచి పానవట్టం వరకు లింగాన్ని అన్నంతో కప్పుతారు. ఆ తరువాత ఒక చిన్న శివలింగాన్ని, నందిని తీర్చిదిద్దుతారు. లింగంపై వివిధ రకాల కూరగాయలను ఉప్పు లేకుండా ఉడికించి సర్పాభరణాలుగా, చంద్రవంకగా, డమరుకంగా, త్రిశూలంగా అలంకరిస్తారు. అంతేకాకుండా పోలీసులు, సుఖియలు, మురుకులు, ఫేణీలు, వడలతో అలంకరిస్తారు.
News November 5, 2025
పశువులకు రేబీస్ వ్యాధి ఎలా వస్తుంది?

పశువుల్లో ఈ వ్యాధి ‘రేబీస్’ వైరస్వల్ల వస్తుంది. ఈ వైరస్ సోకిన కుక్కలు, పిల్లులు, నక్కలు.. పశువులు, గొర్రెలు, మేకలను కరిచినప్పుడు రేబీస్ సోకుతుంది. అలాగే రేబీస్ సోకిన జంతువుల లాలాజలం, కంటి స్రావాలు.. పాడి పశువుల శరీరంపై ఉన్న గాయాలపై పడినప్పుడు కూడా రేబీస్ వస్తుంది. ఈ వ్యాధి బారినపడిన పశువుల పాలను సరిగా మరిగించకుండా తాగినా, మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వ్యాధి మనుషులకూ సోకే అవకాశం ఉంది.
News November 5, 2025
కపిలతీర్థ ముక్కోటి అంటే తెలుసా.?

కార్తీక మాసం పౌర్ణమి రోజున కపిలతీర్థంలో అన్నాభిషేక వార్షిక సేవను నిర్వహిస్తారు. దీనినే కపిలతీర్థ ముక్కోటి అని అంటారు. ఆ రోజున మధ్యాహ్న సమయంలో మహాలింగానికి ఏకాంతంగా అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ ప్రసాదం స్వీకరించేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు.


