News July 14, 2024

NZB: జిల్లాలో పెరుగుతున్న డెంగ్యూ, చికెన్‌గున్యా కేసులు

image

ఉమ్మడి NZB వ్యాప్తంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈక్రమంలో పిట్లం మండలం అల్లాపూర్‌లో గత 2రోజులుగా చికెన్‌గున్యా వ్యాధులు విజృంభించి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం గ్రామంలో వైద్యాధికారులు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇంటింటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

Similar News

News February 22, 2026

NZB: రెండు వారాల్లో 134 DD కేసులు :CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 134 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ 12.10 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

News February 22, 2026

NZB: NAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని NZB అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్మెంట్ కల్పిస్తామన్నారు.