News July 31, 2024
NZB: జిల్లాలో పెరుగుతున్న ‘CYBER’ నేరాలు.!
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2023లో 294 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో ఇప్పటికీ 44 కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని పడ్గల్‌లో ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించి రూ.95 వేలు వసూలు చేశారు. మన అప్రమత్తతే రక్ష, తెలియని వారి మాటలతో మోసపోవద్దని పోలీసులు అంటున్నారు. వారి సూచనలు పాటిస్తే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండొచ్చంటున్నారు.
Similar News
News February 7, 2025
కోటగిరి: ఎత్తోండ క్యాంపులో అక్రమ ఇసుక డంపులు
కోటగిరి మండలం ఎత్తోండ క్యాంపును అడ్డగా మలుచుకున్న కొందరు ఇసుక సూరులు యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గల ఖాళీ స్థలంలో ఇసుక డంపులు చేసి రాత్రికి రాత్రి వాటిని టిప్పర్ల ద్వారా బోధన్, నిజాంబాద్ పట్టణాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ విషయమై గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడంలేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
News February 7, 2025
నిజామాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో మాక్లూర్‌కు చెందిన షేక్ ఫర్వాన్ (24), షేక్ ఇంతియాజ్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా లారీ డ్రైవర్ పరారైనట్లు ఎస్ఐ ఆరీఫ్ వెల్లడించారు.
News February 7, 2025
NZB: కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్
రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా నిధులు అన్నిటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సర్పంచులకు పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.