News March 1, 2025

NZB: జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి

image

నిజామాబాద్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. NZB రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్‌లో చండీ కృష్ణ (37) అనే వ్యవసాయ కూలీ ఫిట్స్‌తో మృతి చెందాడు. అలాగే రుద్రూర్ మండల కేంద్రంలో కాదారి సాయినాథ్ (38) అనే రైతు పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్తూ బురదలో పడి మృతి చెందాడు. అదేవిధంగా నగరంలోని పూసలగల్లీలో బద్దురి లక్ష్మణ్ (41) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News March 1, 2025

సాలూర పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్

image

సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.

News March 1, 2025

నిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే నిజామాబాద్ వాసులు భయపడుతున్నారు. నిజామాబాద్‌లో ఇవాళ, రేపు 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 1, 2025

NZB: ఇంటర్ పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు

image

మార్చ్‌ 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని NZB DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో 36,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 17,789 మంది, రెండో సంవత్సరంలో 18,433 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందు కోసం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

error: Content is protected !!